గరంగరంగా సాగిన నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గరంగరంగా సాగిన నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గరం..గరం
  • తమ డివిజన్లపై వివక్ష ఎందుకన్న ఎంఐఎం
     

నిజామాబాద్, వెలుగు:  నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గరం గరంగా సాగింది. ఓ వైపు తమ డివిజన్లకు నిధులు కేటాయించడంలో పాలక పక్షం వివక్ష చూపుతోందని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపణలు.. మరో వైపు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణలో జరిగిన జాప్యంపై బీజేపీ కార్పొరేటర్లు నిలదీయడంతో మీటింగ్ వాడివేడీగా కొనసాగింది. బుధవారం మేయర్ దండునీతూ కిరణ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో 73 అంశాలపై చర్చించి సభ్యుల మద్దతుతో ఆమోదించారు. 15వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్మశానవాటిక అభివృద్ధికి రూ.95 లక్షలు, బొడ్డెమ్మ చెరువు ట్యాంక్​బాండ్ సుందరీకరణలో భాగంగా బీటీ రోడ్డుకు రూ.38 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేయడంతో రగడ మొదలైంది. 13వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ ఖాన్​తమ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్నేళ్లుగా శ్మశానవాటిక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని సభ దృష్టికి తెచ్చారు. ఎంఐఎం డివిజన్లలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన చెందిన 16 మంది కార్పొరేటర్లు సభను వాకౌట్ చేసి మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు బైఠాయించారు. అధికార పక్షం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. తమ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ మిత్ర పక్ష కార్పొరేటర్లపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. 

ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎప్పుడు పూర్తి చేస్తరు..

కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్ నిర్వహించడంలో జాప్యం చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని బీజేపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డెమ్మ చెరువు ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బండ్ నిర్మాణ పనులు ఏళ్లుగా జరుగుతున్నాయని ఎప్పటికీ పూర్తి చేస్తారని ప్రశ్నించారు. చెరువు వద్ద క్లీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టిన తమ లీడర్లను నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. బొడ్డెమ్మ చెరువులో వినాయక నిమజ్జనానికి అనుమతి ఇవ్వలేదని హిందూ పండుగలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. సీఎం ప్రకటించిన స్పెషల్ ఫండ్ అన్ని డివిజన్లకు సమానంగా కేటాయించాలని డిమాండ్​ చేశారు.

అన్ని డివిజన్లకు ప్రాధాన్యం..

నగరంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీతూ కిరణ్ తెలిపారు. నగర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా జోన్ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. సీఎం కేటాయించిన రూ.100 కోట్లలో అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు.