సినీ ప్రియుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించారు దిగ్గజ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్. త్వరలోనే ఒకే స్క్రీన్ పై ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ 'KHxRK' ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ దిగ్గజ నటుల సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
భారీ బడ్జెట్ తో..
ఈ మూవీ కేవలం కాబినేషన్ పరంగానే కాదు.. బడ్జెట్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందులో విచిత్రం ఏమిటంటే.. కేవలం ఇద్దరు స్థార్ హీరోలు , దర్శకుడి పారితోషికాలకే దాదాపు రూ. 500 కోట్లు కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. లాభాల్లో వాటా పద్దతిలో కమల్ హాసన్ దాదాపు రూ. 220 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం.
రజనీ రెమ్యునరేసన్ ఎంతంటే?
ఇక రజనీకాంత్ తన క్రేజ్ కు తగ్గట్టుగా.. రూ. 180 నుండి రూ. 200 కోట్ల మేర రెమ్యునరేసన్ తీసుకోబోతున్నారని చర్చనడుస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మెగా ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తున్నందున ఆయనకు రూ. 70 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మాణ వ్యయం కేవలం రూ . 150 నుండి 180 కోట్లు ఉంటుందని అంచనా . ఇలా పారితోషికాలతో కలిపి ఇది తమిళ సినీ చరిత్రలోనే అంత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది.
అర బిస్కెట్ చాలు..
దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ తో కలిసి నటిస్తుండటంపై కమల్ హాజన్ తనదైన శైలిలో స్పందించారు. గతంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. మేము ఎప్పుడో కలిసే ఉన్నాం.. కానీ అప్పట్లో నిర్మాతలు ఒక బిస్కెట్ ను రెండు ముక్కలు చేసి మాకు ఇచ్చారు. అందుకే విడిపోయం.. ఇప్పుడు అర బిస్కెట్ చాలు అంటూ చమత్కరించారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, దిగ్గజ కెమెరామెన్ రాజీవ్ మీనన్ విజువల్స్ అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్యాంగ్‌స్టర్ థీమ్ ప్రోమో సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది. సోషల్ మీడియాను ఊపేసింది. 1979లో వచ్చిన 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
