సింగరేణిలో మైన్స్‌ రెస్క్యూ పోటీలు షురూ

సింగరేణిలో మైన్స్‌ రెస్క్యూ పోటీలు షురూ

యైటింక్లయిన్ కాలనీ, వెలుగు :  సింగరేణి రామగుండం రీజియన్–-2 ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో సోమవారం 52వ ఆల్ ఇండియా లెవల్​మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్స్ ప్రారంభమయ్యాయి. మైన్స్ సేఫ్టీ డైరెక్టర్​డాక్టర్‌ శ్యామ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని కోరారు. ఈ రెస్క్యూ పోటీల్లో దేశవ్యాప్తంగా 10 కోల్, 6 మెటల్ కంపెనీలకు చెందిన 25 టీమ్స్ పాల్గొంటున్నాయి.

హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ సంస్థ నుంచి మొదటిసారి విమెన్​రెస్క్యూ టీమ్ పాల్గొనడం విశేషం. డీఎంఎస్, ఏడీఎంఎస్, డీడీఎంఎస్ అధికారులు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం యైటింక్లయిన్‌‌ కాలనీలోని ఎంఆర్‌‌సీ బిల్డింగ్‌‌లో, జీడీకే–7 ఎల్‌‌ఈపీ మైన్‌‌లో రెస్క్యూ పోటీలు జరిగాయి. సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు(ఈఅండ్‌‌ఎం),  ఎన్ వీకే శ్రీనివాస్(ఆపరేషన్స్), జి.వెంకటేశ్వర్ రెడ్డి(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), తదితరులు పాల్గొన్నారు.