గాజు సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్

గాజు సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్

ఒడిశా : గాజు సీసాలో అద్భుతం సృష్టించాడు ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు. కుర్దా జిల్లాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావుకు మినియేచర్ కళాకృతులు తయారు చేయడం అంటే ఆసక్తి. ఈ క్రమంలో క్రిస్మస్ ను పురస్కరించుకుని గాజు సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాజ్ ను రూపొందించాడు. 8 ఇంచుల క్రిస్మస్ ట్రీ తయారీకి ఆరు రోజులు పట్టగా.. 4 ఇంచుల శాంటా క్లాజ్ను రూపొందించేందుకు వారం సమయం పట్టింది. కాటన్, మట్టి, పేపర్ తో పాటు చిన్న చిన్న గాజు ముక్కలను ఉపయోగించి వీటిని రూపొందించినట్లు ఈశ్వర్ రావు చెప్పారు. గతంలోనూ ఇలాంటి కళాకృతులను రూపొందించిన ఆయన పలువురి ప్రశంసలు పొందారు. 

మరిన్ని వార్తల కోసం..

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

పిల్లల్ని కనేందుకు రూ. 25 లక్షల లోన్!