గురుకులాల్లో ఫిర్యాదు బాక్స్ లు పెట్టండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍

గురుకులాల్లో ఫిర్యాదు బాక్స్ లు పెట్టండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍
  • విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించండి
  • అధికారులను ఆదేశించిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍

వరంగల్‍, వెలుగు : జిల్లాల్లోని ప్రతి గురుకుల ఆశ్రమ స్కూల్లో ఫిర్యాదు బాక్సులు పెట్టాలని, వచ్చే సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍ ఆదేశించారు. శనివారం ఆయన గ్రేటర్‍ వరంగల్ లో పర్యటించారు. వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్, సంక్షేమశాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 

రెండు జిల్లాల్లోని సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో వివరాలు, సౌకర్యాలను కలెక్టర్లను మంత్రి అడిగి తెలుసుకుని మాట్లాడారు. రాష్ట్ర సర్కారు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, విద్యాబోధనపై ముఖ్యమంత్రి రేవంత్‍రెడ్డి ప్రత్యేకదృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍ నా గరాజు, హనుమకొండ అడిషనల్‍ కలెక్టర్‍ వెంకట్‍రెడ్డి పాల్గొన్నారు.