భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

ఏపీలో సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి.  పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్  లో భోగి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి.  సంబరాల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు  బంజారా మహిళలతో కలిసి తనదైన శైలిలో డాన్స్ చేశారు.  సంబరాల రాంబాబు అనే పాటకు స్టెప్పులు వేసి కార్యకర్తలను, అభిమానులను ఉత్సహపరిచారు.  గతేడాది మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు.  నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.  ఏటా ఇక్కడికి వచ్చి నారా, నందమూరి కుటుంబసభ్యులు  సంక్రాంతి వేడుకల్లో  పాల్గొంటారు.  

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది.  భోగి పండగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.  వేకువజామున లేచి స్నానాలు ఆచరించి భోగి మంటల్లో పాల్గొంటున్నారు.