ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం  :  మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ 2026 నూతన సంవత్సర డైరీని మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డిలోని క్యాంపు ఆఫీసులో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 80 ఏళ్లుగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం ఎస్టీయూ అని అన్నారు. 

త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా హెల్త్ కార్డులు రూపొందించి అందిస్తామని, పదో తరగతిలో మూడేళ్లుగా జిల్లాను ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉంచుతూ విద్యారంగంలో జిల్లాను ముందంజలో ఉంచుతున్న ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. 

కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రాథోడ్, జీవన్ రాథోడ్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబీర్ అలీ, వివిధ ప్రాంతాల మండల అధ్యక్షులు శివశంకరాథోడ్, సుదర్శన్ రావు, ప్రకాశ్, షరీఫ్, విజయకుమార్, మాణిక్యం, విజయ్ కుమార్, అనిల్ పాల్గొన్నారు.