వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ యార్డుకు గొప్ప చరిత్ర ఉందని, దీన్ని కాపాడటం అందరి బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గతంలో పోలీస్ స్టేషన్లకు కనీసం వాహనాల సౌకర్యం కూడా లేదని, -తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. హోంగార్డుల జీతాలను కూడా పెంచి.. వారి గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడారని అన్నారు. రైతుల సమస్యలు తీర్చడానికి పోలీసులు ముందంజలో ఉండాలని సూచించారు. 

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను మంత్రి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్, సీపీ రంగనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. రానున్న  రోజుల్లో  ట్రాఫిక్, ఇతరత్ర  సమస్యలు కూడా త్వరగా పరిష్కరించేందుకు తమ వైపు నుంచి కృషి చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దాదాపు15 గ్రామాల పేద ప్రజలకు, రైతులకు ఎనుమాముల పోలీస్ స్టేషన్ వల్ల మేలు జరుగుతుందన్నారు.