ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నా : మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నా : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: తెలంగాణ విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. శుక్రవారం మంథని పట్టణంలోని దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మాట్లాడారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ,  దసరా పండుగలను జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతున్నామని, త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తామన్నారు. కార్యక్రమంలో లీడర్లు కుడుదల వెంకన్న, కొత్త శ్రీనివాస్, సురేశ్, ప్రసాద్, శశిభూషణ్ కాచే, వోడ్నాల శ్రీనివాస్, కిరణ్ గౌడ్  పాల్గొన్నారు