వెలుగు, నెట్వర్క్: కాళోజీ జీవితం అందరికీ ఆదర్శనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఆయన ఆశయాలకనుగుణంగా పాలన సాగుతోందన్నారు. శుక్రవారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని కాళోజీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మేయర్ సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే సతీశ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్, రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి పాల్గొన్నారు. త్వరలోనే కాళోజీ క్షేత్రాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండలోని కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాళోజీ హెల్త్యూనివర్సిటీలో కాళోజీ జయంతిని వీసీ బి.కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ టి.వెంకటేశ్వర్ రావు, రిజిస్ర్టార్ డి.ప్రవీణ్ కుమార్ నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీవాళ్లు వస్తే తరిమికొట్టండి..
బచ్చన్నపేట, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని మోడీ అడ్డుకోవాలని చూస్తున్నాడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం బచ్చన్నపేటలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా బచ్చన్నపేట చౌరస్తాలో కాళోజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌వాళ్లు, బీజేపీవాళ్లు గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అలాగే అమలు కావాలంటే కేసీఆరే సీఎంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు కన్వీనర్ రమాణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఎంపీపీ నాగజ్యోతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు
హనుమకొండ సిటీ, వెలుగు: వ్యవసాయ ఫీడర్లను ప్రత్యేక ఫీడర్లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ అన్నమనేని గోపాల్ రావు సీజీఎంలను ఆదేశించారు. శుక్రవారం నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ఆఫీసులో డైరెక్టర్లు, సీజీఎంలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా గోపాల్ రావు మాట్లాడుతూ సీజీఎంలు విద్యుత్ చౌర్యంపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్రోలింగ్ స్టాక్, ఫెయిలూర్స్ పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్ రావు, పి.గణపతి, సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, వి.తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
మరిపెడ, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతుందని డోర్నకల్ఎమ్మెల్యే డీఎస్రెడ్యానాయక్అన్నారు. కేసీఆర్ ను కాదని వేరే పార్టీకి ఓట్లు వేస్తే వాళ్లు నిజంగా దరిద్రులే అవుతారంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మరిపెడ మండల పరిషత్ ఆఫీసులో 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓట్లప్పుడు వచ్చి మాటలు చెప్పే పార్టీలు పని చేయవని, ఒకవేళ చేసినా గెలవవన్నారు. ఇప్పటి సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, కొత్తవి రావాలన్న సీఎం కేసీఆర్ ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ, చిన్నగూడూరు జడ్పీటీసీ సునీత, మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర, తహసీల్దార్రాంప్రసాద్, టీఆర్ఎస్లీడర్లు అచ్యుతరావు, మహేందర్ రెడ్డి, రాంబాబు, వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దు
గూడూరు, వెలుగు: మావోయిస్టులకు ఎవరూ ఆశ్రయం కల్పించొద్దని మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం గూడూరు మండలం ఊట్ల, మట్టెవాడ , కార్లాయి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే 100నంబర్ కు ఫోన్‌చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ సదయ్య, సీఐ యాసిన్, ఎస్సై సతీశ్, కొత్తగూడ ఎస్సై గణేశ్ఉన్నారు.
‘కేసీఆర్‌కు పుట్టగతులుండవు’
మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.కోట్లు ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని, పీఎం మోడీని నోటికొచ్చినట్లు విమర్శిస్తున్న సీఎం కేసీఆర్ కు పుట్టగతులుండవని బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ అధికార ప్రతినిధి భట్టు రవి ఫైర్ అయ్యారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఏంపేడు విలేజ్ లో ఎస్సీ మోర్చా కార్యకర్తల మీటింగ్ జరిగింది.ఈ సందర్భంగా భట్టు రవి మాట్లాడుతూ మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని, టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదన్నారు. అనంతరం ఎస్సీ మోర్చా మండల కమిటీ ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా మిట్టపల్లి రవీందర్,జనరల్ సెక్రెటరీగా కొరిమి రమేష్, మిట్టపల్లి శ్రీకాంత్ ను నియమించారు.
మారుమూల గ్రామాలకు సెంట్రల్ స్కీంలు అందాలి
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: మారుమూల గ్రామాలకు సెంట్రల్స్కీంలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ పసునూరి దయాకర్ కోరారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం పసునూరి దయాకర్ అధ్యక్షతన జరిగింది. వ్యవసాయం, మైనింగ్, ఉపాధి హామీ, కృషి యోజన, గ్రామీణ స్వచ్ఛభారత్, పీఎం సడక్ యోజన, ఆరోగ్యమిషన్ స్కీంల అమలు తీరుపై రివ్యూ చేశారు.
నారీ శక్తి పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ అర్బన్, వెలుగు: నారీ శక్తి పురస్కార్లకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడబ్ల్యూవో జె. జయంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అత్యుత్తమంగా పనిచేసిన మహిళలను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తి అవార్డు ఇస్తోందన్నారు. www.awads.gov.in <http://www.awads.gov.in> పోర్టల్ లో అక్టోబర్31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
47 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా..!
ములుగు, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా సెప్టెంబర్ 9, 2020లో వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్మాట ఇచ్చి నేటికి రెండేళ్లు అయినా పట్టించుకోవడంలేదని వీఆర్ఏల జేఏసీ జిల్లా కన్వీనర్ పాండవుల మహేందర్ ఆరోపించారు. శుక్రవారం ములుగులో దీక్షా శిబిరం వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ 47రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమ న్యాయమైన సర్వీస్ పరమైన నిబంధనలను పరిష్కరించాలన్నారు. వెంటనే పేస్కేల్అమలు చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు సురేశ్, ఉపాధ్యక్షుడు సందీప్, ప్రధాన కార్యదర్శి మహేశ్, నరేశ్, స్వామి, పద్మ, రజిత, సాంబయ్య, లలిత, లావణ్య, సంపత్, సారయ్య పాల్గొన్నారు.
చింతలపల్లి సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేత
మొగులపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతలపల్లి సర్పంచ్ లడే సమ్మక్కపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సస్పెన్షన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. కొన్ని నెలల కింద అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై కంప్లైంట్ మేరకు ఆఫీసర్లు ఎంక్వయిరీ చేసి సర్పంచ్ ని కొన్ని నెలల పాటు సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే.
రామయ్యకు నేషనల్అవార్డు గర్వకారణం
ములుగు, వెలుగు : అబ్బాపూర్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ కందాల రామయ్యకు నేషనల్అవార్డు రావడం జిల్లాకు గర్వకారణమని డీఈవో జి.పాణిని కొనియాడారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రామయ్యను డీఈవోతోపాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ టీచర్స్‌డే సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు.
పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ
మహబూబాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్‌లో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కేక్ కట్ చేశారు. అంతకుముందు తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట కుమారులు యశ్వంత్ రావు, దుష్యంత్ రావు ఉన్నారు.
అత్యాచార నిందితునికి 20 ఏండ్ల జైలు
గూడూరు, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ పోక్సో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్జిల్లా గూడూరు మండలం గుండెంగకు చెందిన ఓ గిరిజన బాలికపై 2016 జనవరిలో వరంగల్ జిల్లా జఫర్ గడ్కు చెందిన గబ్బెట చంద్రయ్య (41) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. గూడూరు సీఐ యాసిన్, ఎస్సై సతీశ్ఎంక్వైరీ చేసి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం జడ్జి పి.వసంత్ పాటిల్.. చంద్రయ్యపై నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగిన నిమజ్జనాలు
నెట్వర్క్, వెలుగు: నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఊరువాడా అంతటా గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేశారు. గ్రేటర్లో జోరువానలోనే నిమజ్జనం ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన వాన సాయంత్రం 5.30 వరకు కురిసింది. గణేశ్ నిమజ్జనానికి వెళ్లే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరంగల్ బట్టలబజార్ మెయిన్ రోడ్‍పైకి మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో చెరువును తలపించింది. మొత్తంగా రెండు, మూడు గంటలు ఆలస్యంగా గణేశుని ఊరేగింపులు మొదలయ్యాయి. నిమజ్జనం సందర్భంగా ట్రైసిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. గణేశుని శోభాయాత్రలో డీజేలు పెట్టకుండా కట్టడి చేశారు. నిమజ్జనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‍భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం గోదావరిలో నిమజ్జనం చేసేందుకు గణపయ్యలు తరలించారు.