మంత్రి ఎర్రబెల్లికి కరోనా పాజిటివ్

మంత్రి ఎర్రబెల్లికి కరోనా పాజిటివ్

తెలంగాణలో ఒమిక్రాన్, కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 41 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మరోసారి నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడకు వెళ్లొచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మంత్రి టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్టులో ఎర్రబెల్లికి పాజిటివ్ వచ్చింది. తనతో ఈ మధ్య కాలంలో కలిసిన వారంతా తప్పనిసరిగా ఐసోలేషన్ లో ఉండాలని మంత్రి కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. మొన్నటి వరకు వడ్లు కొనాలంటూ ఢిల్లీలో ఫైట్‌ చేసిన తెలంగాణ నేతలు ఒక్కొక్కరిగా వైరస్ బారిన పడుతుండటంతో... మిగిలిన నేతలు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 140 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 92 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 499 యాక్టివ్ కేసులుండగా.మొత్తం 4 వేల 021 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

కేబుల్‌ బ్రిడ్జి వద్ద రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్

ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్