ఢిల్లీ పార్టీలకు తెలంగాణలో ఏం పని? : గంగుల కమలాకర్

ఢిల్లీ పార్టీలకు తెలంగాణలో ఏం పని? : గంగుల కమలాకర్
  •      మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తా.. 
  •      ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ మరోసారి గుడ్డిదీపమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ, ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. మోటార్​ ఫీల్డ్​ సంబంధిత అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఆయన కరీంనగర్ లోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్లంబర్స్, ఫోర్ వీలర్స్ మెకానిక్స్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. 

కొత్తపల్లి : కరీంనగర్​ నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేశామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రం రాక ముందు వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కొత్తపల్లిలోని 25 కులసంఘాలు, కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ లో ముదిరాజ్ సంఘం, మున్నూరుకాపులతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న కొత్తపల్లిని అభివృద్ధి చేయాలని ఎవరికీ మనసు రాలేదని

నేడు ఎంతో అభివృద్ధి చేశానన్నారు. అనంతరం పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరగా మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీలు శ్రీనివాస్, వినయ్ పాల్గొన్నారు.