దేశంలో వైద్య రంగంలో తెలంగాణకు థర్డ్ ప్లేస్

దేశంలో వైద్య రంగంలో తెలంగాణకు థర్డ్ ప్లేస్

వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాలానగర్ లో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. త్వరలోనే మహబూబ్ నగర్ లో 900 పడకల ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు మంత్రి హరీశ్ రావు. ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి వల్లే.. మహబూబ్ నగర్ లో ఐసీయూలు, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటయ్యాయన్నారు హరీశ్ రావు. కరోనా కట్టడికి స్వీయనియంత్రణే ముఖ్యమని,  అందరూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, అయితే తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

కాగా, అంతకు ముందు నాయణపేట జిల్లా కోయిలకొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 317 జీవోను వ్యతిరేకించడం అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దనడమేనన్నారు. జీఓపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా వారికే దక్కాలన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు.  తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమి లేదని... కేంద్రానికే తెలంగాణ ఇచ్చిందే ఎక్కువన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..

టెస్టు కెప్టెన్సీపై మనసులోమాట బయట పెట్టిన రాహుల్

పెట్రోల్ కొనుక్కోవడానికి శ్రీలంకకు భారత్ అప్పు