మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్ను అడ్డుకున్నరు

మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్ను అడ్డుకున్నరు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ కార్యకర్తలు  మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను  నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  మంత్రులు హరీశ్ రావ్, ఇంద్రకరణ్ రెడ్డిల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ లోని  ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్ మిషన్ ను ఇంద్రకరణ్ ప్రారంభించారు.