
- మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భాషా వ్యాప్తి, సాంస్కృతిక వికాసానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో దశాబ్దాలుగా భాషా, సాహిత్య సాంస్కృతిక, కళల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల సేవలను ఈనాటికి కొనసాగించాల్సిన అవసరం ఉందని, వాటికి చేయూతను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఈ మేరకు రూ.45 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ సారస్వత పరిషత్ కు రూ. 20 లక్షలు, కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయానికి రూ.10 లక్షలు, చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభకు రూ.10 లక్షలు, వరంగల్ లోని పోతన విజ్ఞాన పీఠానికి రూ.5 లక్షల వార్షిక గ్రాంట్ ను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.