వీపనగండ్ల మండలంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి

వీపనగండ్ల  మండలంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి

వీపనగండ్ల, వెలుగు: మండల పరిధిలోని పుల్గర్ చర్లలో ఆదివారం ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పుల్గర్ చర్ల నుంచి కల్వరాల వరకు రూ.22 లక్షలతో మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణానికి, పుల్గర్ చర్ల శివారులో రూ.2.90 లక్షలు సబ్​స్టేషన్​ నిర్మాణానికి భూమిపూజ చేసి, కొత్త గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కల్వరాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.