సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నరు : కేటీఆర్

సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నరు : కేటీఆర్
  • గుజరాత్‌‌‌‌లో లాగా ఇక్కడి బొగ్గు గనులను సింగరేణికి ఎందుకివ్వరు? అని ప్రశ్న
  • కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కామెంట్
  • మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది.. మీదే అదానీ చేతుల్లో ఉంది’ అని కౌంటర్ 

కోల్​బెల్ట్/గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు : కేసీఆర్ అంటే నమ్మకమని, ప్రధాని మోదీ అంటే అమ్మకమని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి సంస్థను అమ్మేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘గతంలో రామగుండంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని ప్రకటించారు. కానీ ఆ తర్వాత నెల రోజులకే తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను బహిరంగ వేలం వేశారు. పైగా ఆ వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దేశంలో ఉన్న రైల్వే, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కమీషన్ల కోసం అదానీ లాంటి వాళ్లకు అమ్మేస్తున్నారు” అని అన్నారు. కేటీఆర్​ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.250 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మందమర్రి మండలం శంకర్​పల్లిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. అనంతరం మందమర్రిలో రోడ్​షోలో, రామకృష్ణాపూర్ లో జరి గిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన రామగుండం దశాబ్ది ప్రగతి సభలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. సింగరే ణిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న మోదీ.. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని ప్రశ్నించారు. ‘‘గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్కడి గనులను గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాసిచ్చారు. మరి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు ఎందుకివ్వడం లేదు. మోదీ.. దేశానికి ప్రధానా? లేక గుజరాత్​కు ప్రధానా?” అని విమర్శించారు. 

మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు..  

రాష్ట్రంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రుణమాఫీ చేయకపోవడం వల్లనే రైతులు చనిపోతున్నారంటూ ప్రధాని మోదీ మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభలో అబద్ధాలు చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదవడం మానేసి, నిజాలు తెలుసుకోవాలని సూచించారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, రూ.37 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేశామని తెలిపారు. ‘‘మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా.. మాది కుటుంబ పాలన అంటూ విమర్శిస్తున్నారు. అవును.. మాది బరాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుటుంబ పాలనే. నాలుగు కోట్ల మంది ప్రజలకు కుటుంబ పెద్దగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని చేస్తున్నారు” అని అన్నారు. తెలంగాణలోలాగే దేశమంతా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని కామెంట్ చేశారు.  

కాంగ్రెస్ కు ఓటేస్తే మొండిచెయ్యే.. 

కాంగ్రెస్ ఇచ్చిన​గ్యారంటీలు చూసి గాయిగాయి కావొద్దని, వాటికి ఎలాంటి వారెంటీ లేదని కేటీఆర్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. ఆ పార్టీకి అధికారమిస్తే ఆరు గ్యారంటీలేమో గానీ.. 24 గంటల కరెంట్​పోయి 3 గంటలు వస్తది. ఏడాదికి ఒక సీఎం మారుతడు. రాష్ట్రం కుంభకోణాలకు వేదిక అవుతుంది” అని విమర్శించారు. కాంగ్రెస్​కు ఓటేస్తే మొండిచేయి చూపుతారని, బీజేపీకి ఓటేస్తే చెవిలో పువ్వు పెడతారని కామెంట్ చేశారు. ‘‘కర్నాటక, ఢిల్లీ నుంచి డబ్బు సంచులతో వచ్చి ఓట్లు అడుగుతరు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని మోసాన్ని మోసంతోనే దెబ్బ తీయాలి” అని పిలుపునిచ్చారు. 

ఉద్యమంలో విద్యార్థుల త్యాగం గొప్పది: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థుల త్యాగం ఎంతో గొప్పదని మంత్రి కేటీఆర్​అన్నారు. ఆదివారం ప్రగతి భవన్​లో తెలంగాణ అమరవీరుల త్యాగాలపై రూపొందించిన అమరజ్యోతి డాక్యుమెంటరీని ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. 1969 నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు సమైక్యవాదుల కుట్రల కారణంగా యువకుల బలిదానాలను పది నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీలో చూపించారని మంత్రి తెలిపారు. దీన్ని ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలని కోరారు. డాక్యుమెంటరీని రచించి, వ్యాఖ్యానం చేసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దర్శకుడు బదావత్​పూర్ణచందర్​ను మంత్రి అభినందించారు. తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్​వ్యాసాల సంకలనం ‘నడక’, పర్యావరణం పారిశుధ్యంపై డాక్టర్​గాదె వెంకటేశ్​రాసిన ‘కసుపు’..కేసీఆర్​ప్రభుత్వం సాధించిన విజయాలపై జూలూరు గౌరీశంకర్​వెలువరించిన ‘తెలంగాణ మోడల్’ పుస్తకాలకు ఈ సందర్భంగా కేటీఆర్​ ఆవిష్కరించారు.