బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

ఎర్రబెల్లి దయాకర్ రావు అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని కేటీఆర్ ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరైయ్యారు. కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి నాయకత్వం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణమన్నారు. మంత్రి కృషి, అధికారులు పనితీరు వల్లే ఇలాంటి గుర్తింపు లభించిందని అభినందించారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి పాఠాలు నేర్పిస్తుందని చెప్పారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. 

మేము ఏమి చేశామో ప్రతి గ్రామంలో రెండు గంటలు చెప్పే దమ్ము మాకుంది.. మాతోపాటు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలకు ఆ దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎకరాకు కనీసం రెండు రూపాయల లాభం కూడా లేదని ఆరోపించారు. బీజేపీ దొంగసొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుడు ప్రభుత్వాలను కూల్చుడే మోడీ పాలన అని విమర్శించారు. కేవలం మతపరమైన పంచాయతీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోడీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన( ఖరీదైన) ప్రధాని అంటూ ఎద్దేవ చేశారు. రూ.18000 కోట్లు ఫీజు రీఎంబర్స్ మెంట్ అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని పేర్కొన్నారు. పాలకుర్తి ప్రజలకు మీకు దమ్ముంటే.. మా సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీ ఎర్రబెల్లి దయాకరరావు కు ఇవ్వాలి సవాల్ విసిరారు.