టాయ్​ పార్క్​కి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. 2500 మందికి ఉపాధి

టాయ్​ పార్క్​కి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. 2500 మందికి ఉపాధి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండు మల్కాపూర్​లో టాయ్​ పార్క్​కు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఈ పార్క్​ ద్వారా దాదాపు 2500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. గ్రామీణ యువత, స్థానికులు, చెక్క బొమ్మల తయారీలో నిమగ్నమైన ప్రాంతీయ కళాకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.  16 మంది బొమ్మల తయారీ పారిశ్రామికవేత్తలకు ఇందుకు సంబంధించిన  లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందజేశారు. 

ఉత్పత్తులివే..

ప్రభుత్వం  బొమ్మలు,  ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, నాన్ టాక్సిక్, సిలికాన్,  పర్యావరణ అనుకూలమైన బొమ్మల తయారీని ప్రోత్సహించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు,  సౌకర్యాలతో పార్క్ ని అభివృద్ధి చేయనుంది.  ఈ పార్క్‌లో టాయ్ మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్,  చిల్డ్రన్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్ కూడా ఉంటాయి.