
టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్ లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. నిజామాబాద్‌లో కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఇంటరాక్షన్ మీటింగ్లో ‘టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్’ అంశంపై మంత్రి మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నాలుగేళ్లలో నిర్మించామని, లక్ష కిలోమీటర్ల పైప్లైన్ వేసి మిషన్ భగీరథ ద్వారా కోటి ఇళ్లకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రూరల్ ఏరియాలకు ఐటీని విస్తరించడంతో పాటు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు.