మునుగోడు దత్తత పై మంత్రి కేటీఆర్ ట్వీట్

మునుగోడు దత్తత పై మంత్రి కేటీఆర్ ట్వీట్

మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఎన్నికల  ప్రచారంలో తాను ఇచ్చిన హామీ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.  ఇచ్చిన మాట ప్రకారం మునుగోడును దత్తత తీసుకుంటానన్న ఆయన... త్వరలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులను పూర్తి చేస్తామన్నారు. మునుగోడు అభివృద్దికి తన వంతు కృషి చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ పార్టీపై,  సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై విశ్వాసం ఉంచి అండగా నిలిచిన ఓటర్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి అభినందనలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు బై పోల్ లో  బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,341 ఓట్ల తేడాతో  విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఓవరాల్ ఆధిక్యంతో ఎక్కడా వెనకబడకుండా టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి డిపాజిట్ గల్లంతైంది.