
కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ 3వ వార్డులో పర్యటించారు. లంచం ఇవ్వనందుకు కౌన్సిలర్ భర్త ప్రభాకర్ రెడ్డి అధికారులతో కూల్చివేయించిన ఇళ్లను పరిశీలించారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని మంత్రి మల్లారెడ్డి పోలీసులను ఆదేశించారు.
మరోవైపు అప్పుచేసి ఇల్లు కట్టుకుంటుంటే కౌన్సిలర్ భర్త ప్రభాకర్ రెడ్డి 3లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారని బాధితుడు రాంనాథ్ తెలిపాడు. పైసలు ఇచ్చే పరిస్థితి లేదని బతిమిలాడినా ప్రభాకర్ రెడ్డి వినపించుకోలేదన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని, మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లానని రాంనాథ్ చెప్పాడు.