గురుకుల పాఠశాలలో క్రీడ పోటీలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

గురుకుల పాఠశాలలో క్రీడ పోటీలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్..ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిద్దితున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మాల్లారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మండలం అంకుశపూర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 6వ ఆర్ డీసీ క్రీడా పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని.. ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలని ఎక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురుకుల హాస్టల్ లో చదివిన విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలపైనే ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టారని చెప్పారు. 

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చాలా గొప్పగా చదువులు చెపుతున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అమ్మాయిలపై చదువు కోసం 20 లక్షల వరకు ఇస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 268 గురుకుల పాఠశాలలు ఉన్నాయని.. వీటిలో ఎస్సీ, బీసీ, మైనారిటీల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు.