దేశంలో ఎక్కడా లేని పథకాలు.. రాష్ట్రంలో అమలైతున్నయ్​ : మంత్రి మల్లారెడ్డి

దేశంలో ఎక్కడా లేని పథకాలు.. రాష్ట్రంలో అమలైతున్నయ్​ : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా నాగారం మున్సిపాలిటీ పరిధిలో క్రైస్తవులకు మంత్రి మల్లారెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. స్టార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో క్రైస్తవులకు ప్రభుత్వ కానుకగా దుస్తులు అందించారు.

ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన చెప్పారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి లబ్ధిదారులకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, పాస్టర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.