ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి : నిరంజన్ రెడ్డి

ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి : నిరంజన్ రెడ్డి

ఖిల్లా ఘనపురం, వెలుగు : భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని సోలిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి, విసునూరు దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని చేపట్టారని కొనియాడారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ విజయ్ కుమార్, వివిధ గ్రామాల రజకులు పాల్గొన్నారు.

సౌలతులు కల్పిస్తున్నాం..

పెద్దమందడి : గ్రామంలో సౌలతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి సాగు నీటిని అందించామని, కానాయపల్లి మనిగిల్ల లిఫ్ట్  పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. పామిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్  ఆఫీస్​ను ప్రారంభించారు. గ్రామానికి చెందిన 60  మందితో పాటు పెబ్బేరు మండలం గుమ్మడం తండాకు చెందిన 30 మంది యువకులు బీఆర్ఎస్ లో చేరారు. జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, మన్యపు రెడ్డి, రాజప్రకాశ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొన్నురు శ్రీనివాస్ రెడ్డి, నాగేంద్రం, శ్రీనివాస్ గౌడ్, కుమార్ యాదవ్,  అశోక్ రెడ్డి, వేణు యాదవ్  పాల్గొన్నారు.