ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం  : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం  : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి, ఖమ్మం రూరల్​ మండలాల్లో ఆయన పర్యటించారు. కూసుమంచి మండలం నేలపట్ల ఎస్సీ కాలనీలో రూ.24 లక్షలు, మల్లేపల్లి ఎస్సీ కాలనీలో రూ.36 లక్షలు, జక్కేపల్లి  ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, రూ,15 కోట్లతో పాలేరు పట్టణ పరిధిలో సూర్యాపేట-–అశ్వారావుపేట రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు ఎస్సీ కాలనీలో రూ. 52 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలు, రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పాలేరు, సూర్యాపేట -అశ్వారావుపేట రోడ్డు సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైన్ నిర్మాణ పనులకు, రూ. కోటి 50 లక్షలతో నిర్మించనున్న మారెమ్మ టెంపుల్ - కేంద్రీయ విద్యాలయ రోడ్డు, కరుణగిరి జంక్షన్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

గోల్లపాడులో రూ.16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి పెద్దతండాలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

మిగతా అంతర్గత రోడ్లను  వర్షాకాలం లోపు పూర్తి చేస్తామన్నారు. ఇండ్లపై నుంచి వెళ్లే హై టెక్షన్​ వైర్లు తీసేస్తామని చెప్పారు.  మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏడీఏ సరిత ఉన్నారు.