సమ్మక్క సారక్క అండ మాకుంది.. మా ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరు: మంత్రి పొన్నం ప్రభాకర్

సమ్మక్క సారక్క అండ మాకుంది.. మా ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరు: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ 4వ డివిజన్ లో AIMIM కార్పొరేటర్ నుజహత్ అలీ ఆధ్వర్యంలోమున్సిపల్ కార్మికులకు కోళ్లు పంపిణీ చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో సందర్భంగా డివిజన్ ప్రజలు క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని కార్మికుల మొక్కు చెల్లించేందుకు వీటిని పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోతుందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్బాలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సమ్మక్క సారక్క అండ మాకుందని.. తమ ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తమది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వమని.. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేసి తారుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు కూడా కాలేదని.. అప్పుడే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Also Read : డైరీ ప‌రిశ్రమల ట‌ర్నోవ‌ర్ రూ. 10 ల‌క్షల కోట్లకు ఎదిగింది