
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేరుపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నక్షత్ర దీక్షాపరులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొత్తకొండ వాసి సింగం రమేశ్ రచించి అర్చకుడు తాటికొండ వినయ్ శర్మ పాడిన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కాగా, 27 రోజులపాటు 100 మందికి పైగా ఉన్న నక్షత్ర దీక్షాపరులకు మంత్రి అన్నదాన కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు.