కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కార్ దవాఖానాలు : మంత్రి వేముల

కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కార్ దవాఖానాలు : మంత్రి వేముల

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మే 28వ తేదీ ఆదివారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించారాయన. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖరీదైన సిటీ స్కానింగ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వేముల. రూ14 లక్షల వ్యయంతో కాట్రాక్ కంటి మిషన్లు కూడా ప్రారంభించామని మంత్రి తెలిపారు.

అలాగే మానసిక వికలాంగుల చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. మానవీయ కోణంలో ఏర్పాటు చేసిన మానసిక వికలాంగుల విభాగం 24 గంటలు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి .400ల డిజిటల్ బీపీ మిషన్ లను జిల్లాలోని అన్ని పీహెచ్ సి లకు పంపిణీ చేసామన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.