వాళ్లది సెల్ఫీల డ్రామా..మాది మహిళా పక్ష పాత ప్రభుత్వం

వాళ్లది సెల్ఫీల డ్రామా..మాది మహిళా పక్ష పాత ప్రభుత్వం

ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.  జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు.   ప్రతిపక్ష నాయకులు సెల్ఫీ లతో డ్రామా చేస్తున్నారు. అదే వాళ్లకు సెల్ఫ్ గోల్‌గా అభివర్ణించారు. 17 సంవత్సరాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు. ఆయన సొంత  జిల్లా విజయనగరానికి ఏమైనా చేశాడా? అంటూ మండిపడ్డారు. జిల్లాలో ఒక్క కాలేజ్ నిర్మించలేని అశోక్ గజపతిరాజు సెల్ఫీ లు తీసుకోవడం విడ్యడూరంగా ఉందంటూ ఫైర్‌ అయ్యారు.

ఆయన  కేంద్ర మంత్రిగా చేసినా విమానాశ్రయం తెచ్చుకొలేని వ్యక్తి అశోక్ గజపతిరాజు అంటూ విమర్శించారు రోజా.. విమానాశ్రయానికి మీరు శంకుస్థాపన చేస్తే ఎందుకు పూర్తి చేయలేకచేయలేక పోయారు? అని ప్రశ్నించారు. ప్రజాపక్షనేత గా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది.. జగనన్నను చూసి చంద్రబాబు, అశోక్ గజపతిరాజు బుద్ధి తెచ్చుకోవాలంటూ హితవుపలికారు.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. సెల్ఫీలతో కాలక్షేపం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యానించారు మంత్రి  రోజా.