కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణకు ముప్పు : మంత్రి సీతక్క

 కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణకు ముప్పు : మంత్రి సీతక్క
  •  బేగంపేటలో మంత్రి సీతక్క విమర్శ
  • సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం

పద్మారావునగర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు తెలంగాణ భ‌‌విష్యత్తుకు ముప్పుగా దాపురించిందని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ నిర్వాకంతో నెల‌‌కు 6 వేల కోట్ల అప్పు కడుతున్నామని చెప్పారు. అప్పులు, అమ్మకాలు త‌‌ప్ప గత ప్రభుత్వం చేసినది ఏమీ లేదన్నారు. బేగంపేట పాటిగడ్డ ఎన్ బీటీ నగర్ కు చెందిన సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మంగళవారం ఆమె భోజనం చేశారు.

 సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సన్న బియ్యం స్కీమ్​తో పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. పేదలు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకుల కడుపు మండుతోందన్నారు. స‌‌త్తా ఉన్న నాయ‌‌కుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. అంత స‌‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌‌చ్చి నిరూపించుకోవాలి కానీ పత్తా లేకుండా పోతే ఎలా అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ మెంబర్​డాక్టర్​కోట నీలిమా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.