మను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నం: మంత్రి సీతక్క

మను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నం: మంత్రి సీతక్క
  •  అంబేద్కర్​రాజ్యాంగం వల్లే నాకు మంత్రి పదవి  
  • జన్నారంలో మంత్రి సీతక్క 
  • ఆదివాసీ గిరిజనులు రాజకీయాల్లో రాణించాలన్న 
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి 

జన్నారం:  బీజేపీ, ఆర్ఎస్ఎస్​ వనవాసి పేరుతో మను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు.  కేంద్రంలో ఏకంగా రాజ్యాంగాన్నే మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ఈ కుట్రలను ఆదివాసీ బిడ్డలు తిప్పికొట్టాలన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా జన్నారంలో  కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ప్రతినిధుల శిక్షణ శిబిరంకు చీఫ్​గెస్ట్​  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తో కలిసి పాల్గొన్నారు.  తాత ముత్తతలు ఇచ్చిన ఆస్థిత్వాన్ని ఆదివాసులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.   కార్పోరేట్​శక్తులకు వత్తాసు పలికే ప్రధాని మోదీ.. ఆదివాసులు నివాసముందే చోట  రోడ్డు, ఇండ్ల స్థలాలకు పరిష్మన్లు ఇవ్వడం లేదన్నారు.  అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను  మూడు సార్లు ఎమ్మెల్యే గా, ఇప్పుడు  మంత్రి పదవి కూడా వచ్చిందన్నారు. 

 చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..  ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు  బి.ఆర్.అంబేద్కర్ ఒక మార్గం చూపారన్నారు. ‘ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు  రాజ్యాంగాన్ని మార్చాలని,  పేద ప్రజల హక్కులను తొలగించే  కుట్రలు చేశారు. దేశ ప్రజలు గుర్తించి  పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీలకు సరియైన గుణపాఠం చెప్పారు. అంబేద్కర్ అందించిన హక్కులను కాపాడుకుంటూ,ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు సాగాలి.  కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆలోచిస్తుంది’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు.