గడ్డం వంశీ గెలిస్తే యువతకు ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు

గడ్డం వంశీ గెలిస్తే యువతకు ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అప్పులు చేసిన బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ గ్యారంటీలపై మాట్లాడే అర్హత లేదన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన యువ సమ్మేళనం, గొల్లపల్లి, పెగడపల్లి కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ల్లో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు రాయపట్నం నుంచి ధర్మపురి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

 శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు మాట్లాడుతూ.. అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పారు. వంశీని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని, ఆయనను గెలిపిస్తే యువత ఉపాధికి తాము గ్యారంటీ అని పేర్కొన్నారు. వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే ఈడీ ఎందుకు విచారణ చేయడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి ప్రశ్నించారు. మీకు దమ్ముంటే కాళేశ్వరంపై విచారణ చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.