బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ 

బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ 

కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్  మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. బాధిత కుటుంబాన్ని సోమవారం  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. అఖిల్ కుటుంబాన్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ఆయనతోపాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌‌‌‌, సుడా చైర్మన్​ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజోద్దిన్, సమద్ నవాబ్, ఇర్ఫాన్, తిరుపతి, లయాక్ పాల్గొన్నారు.