- వరద బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాటారం,వెలుగు : రైతు రుణ మాఫీలో బ్యాంకుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఆలస్యమైతే రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రాణం నష్టం జరిగితే.. శవ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో సోమవారం మంత్రి పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో పలువురు మృతిచెందగా బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించి, అండగా తానుంటానని భరోసా ఇచ్చారు.
అనంతరం గంగారం మోడల్‌స్కూల్ ను తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరదలతో ఎలాంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదలతో పంట, ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినా పట్టించుకోకపోగా కనీసం నష్ట పరిహారం కూడా చెల్లించలేదని మంత్రి విమర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి వెంట కాటారం సబ్కలెక్టర్మయాంక్సింగ్, ఎంపీడీవో అడ్డూరి బాబు, తహసీల్దార్ నాగరాజు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.