బసవేశ్వరుడి ఆశయాలను సాధించాలి

బసవేశ్వరుడి ఆశయాలను సాధించాలి

మహబూబ్నగర్: సామాజిక విప్లవకారుడు బసవేశ్వరుడి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మహాత్మ బసవేశ్వర 889వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని  మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుల రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. దానం, ధర్మం, సమ సమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త అని పొగిడారు. తెలంగాణ రాష్ట్రంలో బసవేశ్వర జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ట్యాంక్ బండ్ పై బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, డీసీసీబీ ఉపాధ్యక్ష్యుడు కొరమోని వెంకటయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

తిరుమల సర్వ దర్శనానికి 6 గంటలు

ఎంబీబీఎస్ స్టూడెంట్లకు యోగా తప్పనిసరి