మన్యంకొండను ఆధ్యాత్మిక, టూరిజం సెంటర్​గా డెవలప్​ చేస్తా : మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

మన్యంకొండను ఆధ్యాత్మిక, టూరిజం సెంటర్​గా డెవలప్​ చేస్తా : మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మన్యంకొండను ఆధ్యాత్మిక, టూరిజం సెంటర్​గా డెవలప్​ చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. శుక్రవారం ఆయన మన్యంకొండ డిజైన్లను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మన్యంకొండ టెంపుల్  వద్ద రోప్ వేను నిర్మిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని కేబుల్  కార్  కంటే మన రోప్ వే మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. రోప్ వేకు అనుసంధానంగా కొండ మీద ఏర్పాటు చేయనున్న ల్యాండింగ్, ల్యాండ్ స్కేపింగ్, స్కే వాక్, అన్నదాన సత్రం, లడ్డు కౌంటర్, కోనేరు తుది డిజైన్లను మంత్రి ఓకే చేశారు. టూరిజం ఓఎస్డీ సత్యనారాయణ, కన్పల్టెంట్  కల్పేశ్ పటేల్, అధికారులు పాల్గొన్నారు.