నాపై కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నరు

V6 Velugu Posted on Jan 27, 2022

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ ను టాంపరింగ్ చేశానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ వెబ్ సైట్ లోని వివరాలను తానెలా? టాంపరింగ్‌‌‌‌‌‌‌‌ చేయగలుగుతారని ప్రశ్నించారు. తన జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మరో నాయకుడు కుట్ర పన్ని, తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రూల్స్ ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్లు వేయొచ్చు. ఇందులో  బీఫాంతో పాటు దాఖలు చేసే అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఫైనల్‌‌‌‌‌‌‌‌. తాను దాన్ని టాంపరింగ్‌‌‌‌‌‌‌‌ చేసినట్టుగా వస్తున్న వార్తలన్నీ అబద్ధం. ఉద్యమం నుంచి వచ్చిన బలహీన వర్గాల నాయకుడిని కాబట్టే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు” అని చెప్పారు. ‘‘మా కార్లపై ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ చలాన్లు ఉన్నాయని, బ్యాంకు లోన్లు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చలాన్లు ఉంటే ఎమ్మెల్యేగా అర్హుడు కాకుండా పోతారా? క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో ముద్దాయిగా తేలి, ఆ విషయం అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొనకపోతేనే తప్పు” అని తెలిపారు. జిల్లా అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చిన్న కులంలో పుట్టడమే తాను చేసినా నేరమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అప్రతిష్టపాలు చేసిన మీడియా సంస్థలపై న్యాయం పోరాటం చేస్తానన్నారు.

ఇదీ వివాదం...

2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ మొదట సమర్పించిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ను ఎన్నికల రిజల్ట్ కు ముందు టాంపరింగ్‌‌‌‌‌‌‌‌ చేశారని పేర్కొంటూ సి.రాఘవేంద్రరాజు అనే వ్యక్తి సీఈసీకి కంప్లయింట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. అప్పటికే తెలంగాణ హైకోర్టులో సైతం ఇదే పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేయడంతో, అక్కడే తేల్చుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ ను డిస్మిస్ చేసింది. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ వాహనాలపై ఉన్న చలాన్లతో పాటు బ్యాంకు రుణాలను అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొనలేదని, వాటిని మార్చి ఎన్నికల ఫలితాలకు ముందు కొత్త అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ ను ఈసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేశారని రాఘవేంద్రరాజు తన పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మస్తు జాబ్స్

రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జాబ్ నోటిఫికేషన్స్ రానున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిరుద్యోగులకు కొలువులు వస్తాయని చెప్పారు. బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో ) కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ‘‘317 జీవోతో ఉద్యోగుల విభజనలో కొంత ఇబ్బంది ఉంది. కొత్త జోనల్ విధానంతో 95% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉద్యోగులు పని చేయాలి” అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Tagged minister srinivas goud, election affidavit tampere

Latest Videos

Subscribe Now

More News