మహిళలకు అండగా ఉంటాం : శ్రీనివాస్ గౌడ్

మహిళలకు అండగా ఉంటాం :  శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మహిళలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. శుక్రవారం రూరల్ మండలం మాచన్ పల్లి తండాలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.12 లక్షలతో నిర్మించనున్న గ్రామ సమాఖ్య బిల్డింగ్​కు భూమిపూజ చేశారు. వెంకటాపూర్ గ్రామంలో రూ.62.70 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. 

రూ.2.55 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి, రూ.10 లక్షలతో నిర్వహించనున్న కమ్యూనిటీ హాల్  పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నిరంగాల్లో రాణించేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్  ఎంపీపీ అనిత, ఎంపీడీవో జ్యోతి పాల్గొన్నారు. నవాబుపేట మండలంలోని మైసమ్మ ఆలయాన్ని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని డెవలప్​ చేస్తామని చెప్పారు.