
రిపేర్లు చేసినా బ్యారేజీల గేట్లు ఎత్తాల్సిందేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంలోని బ్యారేజీలను పరిశీలించిన ఉత్తమ్.. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. నిపుణుల కమిటీ సూచనలు ఇచ్చే వరకు గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. కేసీఆరేమో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చని ప్రచారం చేస్తున్నారు.. ఎన్డీఎస్ఏ వద్దంటోందని అన్నారు ఉత్తమ్.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఉత్తమ్. సుందిళ్లలో నవయుగ కంపెనీ పనుల్లో ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. పనులు వేగవంతం చేయాలని నవయుగ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించామన్నారు. కాంట్రాక్టు నిర్మాణ సంస్థల ఖర్చుతోనే ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తులు జరుగుతున్నాయని చెప్పారు.
ఎల్లంపల్లికి నీటిని ఎత్తి పోయవచ్చని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగిందన్నారు. పాలమూరు రంగారెడ్డికి 20 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరాకు నీళ్ళియ్యలేదన్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ చేయలేదన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది.. 90వేల కోట్లకు వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫలితాలు చూసిన తర్వాత కేసిఆర్ గురించి మాట్లాడుకోడం వేస్ట్ అని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ చేపట్టడతామని చెప్పారు.