చేపల నిల్వకు జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీలు : మంత్రి వాకిటి శ్రీహరి

చేపల నిల్వకు జిల్లాల్లో కోల్డ్  స్టోరేజీలు : మంత్రి వాకిటి శ్రీహరి
  • మంత్రి వాకిటి శ్రీహరి

హన్వాడ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలు నిల్వ చేయడానికి  కోల్డ్  స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హన్వాడ మండలం ఇబ్రహీంబాద్  హేమ సముద్రం వద్ద మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని చెరువులలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.94 కోట్ల విలువైన చేప పిల్లలు, రూ.23 కోట్ల విలువైన రొయ్యలను విడుదల చేస్తున్నామని చెప్పారు. 

ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్  సర్కారు అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఫిషరీస్  చైర్మన్  మెట్టు సాయి కుమార్,  కలెక్టర్ విజయేందిర బోయి, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, ఒలింపిక్  సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ఏఎంసీ చైర్ పర్సన్  బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రంగా దేవుని గుట్ట

మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ లోని దేవునిగుట్టపై కొత్తగా నిర్మించిన శ్రీకంఠ మహేశ్వర స్వామి, సూరమాంబ ఆలయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని దేవునిగుట్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.