అర్వింద్ అంటేనే నిలువెత్తు అబద్ధం, అబద్ధాల పుట్ట : మంత్రి వేముల

అర్వింద్ అంటేనే నిలువెత్తు అబద్ధం, అబద్ధాల పుట్ట : మంత్రి వేముల

ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  అన్నారు. అర్వింద్  గురించి మాట్లాడాలంటే  తనకు అసహ్యం వేస్తుందన్నారు. అర్వింద్ అంటేనే నిలువెత్తు అబద్ధం, అబద్ధాల పుట్ట అని అన్నారు. అర్వింద్ రాజకీయాలకు కళంకం అని వ్యాఖ్యానించారు.  బాండ్ పేపర్ పై రాసిచ్చి మాట తప్పిన ఏకైక నాయకుడు అర్విందేనని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తండ్రిని కాదని పార్టీలు మారే కుటుంబం అర్వింద్ దేనన్నారు. అర్వింద్ కుటుంబంలో ఉన్న ముగ్గురు.. మూడు పార్టీల్లో ఉన్నారని విమర్శించారు.

కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు గవర్నర్ ఎక్కడికి వెళ్లారని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ఇంటిపై దాడి చేసిన్నప్పుడు గవర్నర్ మహిళగా ఎందుకు స్పందించలేదన్నారు. ఇళ్లపైకి దాడులు చేసే ఆట మొదలు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు గాజులు వేసుకోని ఉన్నారా? ఉప్పు కారం తింటున్నామని.. తమకు కోపాలు రావా? అని వేముల అన్నారు.  ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం అయితుందని... తిట్టడమే ప్రెస్ మీట్ గా మారిందన్నారు.  

ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు  బండి సంజయ్ చుట్టమని ఆరోపించారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ కుట్ర అని అన్నారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం బీజేపీకి కొత్త కాదన్నారు.బండి సంజయ్ కి ఫెయిల్యూర్, సక్సెస్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ ఆదాయం రెండు రేట్లు ఎక్కువగా ఉందన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే..తెలంగాణకు కేంద్రం ఇచ్చిన అవార్డులు ఎన్నో సంజయ్ లెక్క పెట్టుకోవాలన్నారు.