గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి వదిలేసింది.. వచ్చే మూడేళ్ళలో అన్ని పనులు పూర్తి చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి వదిలేసింది.. వచ్చే మూడేళ్ళలో అన్ని పనులు పూర్తి చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

శనివారం ( అక్టోబర్ 4 ) షేక్ పేట్ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి... స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం రూ. కోటి 18 లక్షలతో గ్రేవియార్డ్ రినోవేషన్ వర్క్స్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో విజయశాంతి, అంజన్ కుమార్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేసిందని.. వచ్చే మూడేళ్ళలో అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు మంత్రి వివేక్.

అంబేద్కర్ నగర్ లో స్థానికులు చాలా మంది రూ. 50 లక్షలతో స్మశాన వాటిక అభివృద్ధి చేయాలనీ అడిగారని.. వెంటనే శాంక్షన్ చేశామని అన్నారు. తమది ప్రజాపాలన అని.. ప్రభుత్వం గురించి కార్యకర్తలు మంచిగా ప్రచారం చేయాలని అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారని అన్నారు. ఎక్కడికి వెళ్లినా గతంలో కాంగ్రెస్ మాత్రమే చేసిన పనులు ఉన్నాయని చెప్తున్నారని అన్నారు. 

కేటీఆర్ కేవలం పైసలు ఉన్న ఇండస్ట్రీయలిస్ట్ లతోనే మాట్లాడే వాడని..పేదలను పట్టించుకోలేదని అన్నారు.కేవలం బీఆర్ఎస్ శంకుస్థాపనలు చేసి వదిలేసారని.. ఇంకా మూడేళ్లు మేమే అధికారంలో ఉంటాం అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు మంత్రి వివేక్. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఇంచార్జి అయ్యాక నెలరోజులుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారని అన్నారు. 

కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడు పైసలు తీస్కొని షేక్ పేట్ లో రోడ్లు డ్రైన్స్, బ్లాక్ చేయించారని అన్నారు మంత్రి వివేక్. ఇప్పుడు ప్రత్యేకంగా షేక్ పెట్ లో రూ. 33 కోట్లతో అభివృద్ధి పనులు అవుతున్నాయని...సీసీ డ్రైన్స్, రోడ్లు, హై టెన్షన్ కేబుల్స్ వర్క్స్ జరుగున్నాయని అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఇక్కడి ప్రజలు ఊహించని విధంగా పనులు చేస్తున్నామని.. ఇంకా మూడేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని.. నేనే ఇంచార్జ్ గా ఉంటాను... ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు మంత్రి వివేక్.

అప్పట్లో సారు కారు 16 అంటే 8 సీట్లలో ఓడిపోయారని.. అసెంబ్లీలో కూడా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లో డిపాజిట్ లేని పరిస్థితి చూసాం... ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో అదే జరుగుతదని అన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే పెద్ద లీడర్ అవుతా అనుకుంటున్నాడని.. కానీ ప్రజలు ఆదరించరని తెల్సుకోవాలని అన్నారు.