- మంత్రి వివేక్ వెంకటస్వామి
- పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కోల్బెల్ట్, వెలుగు: మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం 100 శాతం రాయితీపై ఫ్రీగా రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో చేప పిల్లలు విడుదల చేస్తోందన్నారు.
బుధవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. జైపూర్మండల కేంద్రంలో రూ.2.55 కోట్లతో నిర్మించిన కస్తుర్భా బాలికల విద్యాలయం నూతన భవనం, కోటపల్లి మండల దేవులవాడలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా, చెన్నూరు మండలం శివలింగాపూర్లో పత్తి కొనుగోలు కేంద్రం, దేవులవాడలో వరి కొనుగోలు కేంద్రాలు, భీమారం మండలం గోల్లవాగు ప్రాజెక్టులో మత్య్సశాఖ ఆధ్వర్యంలో చేపల పంపిణీని మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కోటపల్లి మాజీ ఎంపీపీ రేగళ్ల మధుసూదన్ఇటీవల అనారోగ్యంతో చనిపోగా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.
