నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో (ఎన్ సి సి) జరిగిన ఘటన బాధాకరమని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 28) చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కంపెనీతో మాట్లాడి మృతుల కుటుంబాలలో ఒకరికి శాశ్వత ఉద్యోగం వచ్చేలా చూస్తామని అన్నారు. శాశ్వతంగా మృతుల కుటుంబాలకు వేతనం వచ్చేలా కంపెనీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులనుప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మహాలింగాపురం లో ఉన్న ఎన్ సి సి కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే. సోమవారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి క్రేన్లు కూలడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అప్పటికే షెడ్డులో వర్షానికి తలదాచుకుంటున్న 17 మంది కార్మికులు గాయపడ్డారని మంత్రి అన్నారు. వీరిలో ఘటనాస్థలిలో ఇద్దరు మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు .

