
హన్మకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారని తెలిపారు. 177 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. ఆతర్వాత నర్సంపేట లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఆ సభలోనే వరంగల్ హన్మకొండ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరిస్తారని వివరించారు. టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని వారు విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్.
ఇవి కూడా చదవండి
ఈ ‘చాయ్వాలీ’ టీని తాగాల్సిందే బాస్