వారం రోజుల్లో స్కూళ్లన్నీ నీట్‌గా ఉండాలె

వారం రోజుల్లో స్కూళ్లన్నీ నీట్‌గా ఉండాలె

వైద్యశాఖ రిపోర్ట్ ప్రకారమే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అన్ని విద్యా సంస్థలు రీ ఓపెన్ చేస్తున్నామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 17నెలలుగా విద్యాసంస్థలు ఆగమాగం అయ్యాయన్నారు. స్కూల్స్, కాలేజీలో ఓపెన్ పై రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారంరోజుల్లో స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈనెల 30లోపు స్కూళ్లను నీట్ గా మార్చాలన్నారు. ప్లలె, పట్టణ ప్రగతిలాగే స్కూళ్ల రీ ఓపెన్ కూడా విజయవంతం చేయాలని సూచించారు. పిల్లలకు గ్రామ పంచాయతీల ద్వారా మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై నిఘా పెట్టాలని కలెక్టర్లకు సూచించారు మంత్రులు.