మైనర్ బాలికని మోసం చేసిన దిశ పోలీస్ స్టేషన్ హోంగార్డు

మైనర్ బాలికని మోసం చేసిన దిశ పోలీస్ స్టేషన్ హోంగార్డు

కృష్ణా, మచిలీపట్నం: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని దిశ అనే చట్టాన్ని ప్రవేశపెట్టి, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కానీ కంచే చేను మేసింది అన్నట్లుగా అదే స్టేషన్ లో పనిచేస్తున్న  హోంగార్డు  ఓ మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హోంగార్డు గా పని చేస్తున్న ఫణీంద్ర అనే యువకుడు.. స్థానికంగా ఉంటున్న పదిహేనేళ్ల బాలిక తో పరిచయం పెంచుకొని, ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు. కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో బాధ పడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను మోసం చేసిన ఫణీంద్ర పై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికను మోసం చేసిన ఘటనలో ఫణీంద్ర ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ సత్తిబాబు తెలిపారు.