ఫ్యాషన్ డిజైనర్ కల కోసం... కెఎఫ్​సి డెలివరీ గర్ల్ గా

ఫ్యాషన్ డిజైనర్ కల కోసం... కెఎఫ్​సి డెలివరీ గర్ల్ గా

ఫ్యాషన్​ డిజైనర్ అవ్వాలనుకుంది. కానీ,  పేదకుటుంబం కావడంతో కాలేజీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితి. అలాగని చదువు మానేయలేదు. ఏదో ఒక పని చేసి అయినా  ఫీజు కట్టాలనుకుంది. కెఎఫ్​సిలో డెలివరీ గర్ల్​గా చేరింది. ఫీజుకి అవసరమయ్యే డబ్బులు సంపాదిస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్న ఈ అమ్మాయి పేరు మీరాబ్​.  పాకిస్తాన్​లోని లాహోర్​కి చెందిన ఈమె స్టోరీ సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.   

లాహోర్​లోని యొహనాబాద్​లో ఉంటోంది మిరాబ్. ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చదువుతోంది. అయితే పేదరికం కారణంగా కాలేజీ ఫీజు కట్టలేమని చెప్పారు తల్లిదండ్రులు. దాంతో పార్ట్​టైమ్​ జాబ్ చేసి ఫీజు కట్టాలి అనుకుంది. ఇంటికి దగ్గర్లోని కెఎఫ్​​సిలో డెలివరీ గర్ల్​గా చేరింది.  ఆ సంపాదనతో డిగ్రీ ఫీజు కట్టడమే కాకుండా అనారోగ్యంతో ఉన్న తల్లి దవాఖానా ఖర్చు కూడా భరిస్తోంది మీరాబ్​. ఆమె గురించి తెలిసి కాలేజీ ఫీజు కట్టేందుకు ఒక ఫౌండేషన్​ ముందుకొచ్చింది. అయినా కూడా ‘నా కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు జాబ్​ చేస్తా. సొంతంగా ఫ్యాషన్​ బ్రాండ్ పెట్టాలనేది నా లక్ష్యం’ అంటోంది మీరాబ్. ఫిజా ఇజాజ్ అనే మహిళ మీరాబ్​ గురించి లింక్డ్​ఇన్​లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్ట్​ని 52వేల మందికి పైగా చూశారు.