మాజీ ఎంపీపీ కారును తగులబెట్టిన దుండగులు

మాజీ ఎంపీపీ కారును తగులబెట్టిన దుండగులు

​ఆర్మూర్, వెలుగు :  ఆలూర్​ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ఆర్మూర్​ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారును శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.  పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆర్మూర్​ ఎస్ హెచ్​ వో సత్యనారాయణ గౌడ్ పరిశీలించి కేసు నమోదు  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ సేకరించి నిందితులను పట్టుకుంటామని ఎస్​హెచ్​వో తెలిపారు. గ్రూపు రాజకీయాలు, కక్షతోనే కారును తగులబెట్టినట్లు భావిస్తున్నామని,  పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామని ఎస్​హెచ్​వో పేర్కొన్నారు.